calender_icon.png 16 December, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసిన నూతన సర్పంచులు

16-12-2025 09:28:14 PM

గ్రామాల్లో ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా సామరస్యంగా పనిచేయాలి..

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని మాటూర్ గ్రామ సర్పంచ్ భాగ్య సతీష్, తాండూర్ సర్పంచ్ యాదా గౌడ్, అక్కంపల్లి గ్రామ సర్పంచ్ వెంకట్ గౌడ్లు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇరువురు సర్పంచులకు శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు గ్రామాల అభివృద్ధి దేహంగా పనిచేసే గ్రామాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా గ్రామ ప్రజలు కలిసి మెలిసేలా ఉండేలా చూడాలన్నారు. ప్రతి సమస్యను పెద్దది చేయకుండా సామరస్యంగా మాట్లాడుకుని ఐక్యమత్యంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, నాయకులు సుభాష్ రెడ్డి, మధు,సత్యం,వెంకట్,బండ బాబు,తదితరులు పాల్గొన్నారు.