16-12-2025 08:52:19 PM
అయిజ: జోగులాంబ గద్వాల జిల్లా ఐదు మండలంలోని చిన్న తాండపాడు గ్రామ సర్పంచ్ మహేశ్వరమ్మను ఆమె భర్త సుధాకర్ గౌడ్ ను పక్క ఊరైన కేశవరం గ్రామస్తులు భార్య భర్తలకు ఇద్దరుకు ఘన సన్మానం చేశారు వివరాల్లోకి వెళితే చిన్న తాండ్రపాడుకు కేశవరంకు ఓకే రోడ్డు ఉన్నందువల్ల, మోకాటి లోతు గుంతల మాయమై ద్విచక్ర వాహనాలు ప్రయాణికులు కూడా తిరగడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో, సుధాకర్ గౌడ్ సుమారు గత పది సంవత్సరాల నుండి రోడ్డుకు మరమ్మతులు చేస్తూ ప్రయాణికులకు వాహనాల రాకపోకులకు ఇబ్బందులు లేకుండా చేసినందువల్ల, కేశవరం గ్రామస్తులు సుమారు 50 మందికి పైగా వచ్చి కృతజ్ఞతగా భార్యాభర్తలను సన్మానించడం జరిగింది.
కొందరు ముసలివారు గ్రామస్తులు మాట్లాడుతూ మీ నిస్వార్థ సేవ నీ పరోపకారర్థమే మిమ్మల్ని ఈరోజు గ్రామ సర్పంచ్ గా నిలబెట్టింది అన్నారు. చిన్న తాండ్రపాడు చరిత్రనే తిరగరాశాయని ఇంతవరకు చిన్న తాండ్రపాడు చరిత్రలోనే ఇంత మెజారిటీ రాలేదని, ఏపార్టీ గెలిచిన వంద నుండి ఐదు వందలలోపే మెజారిటీ వచ్చెదని వయసు పైబడిన వ్యక్తుల అనడం విశేషం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్త మహేష్ నాయుడు విశ్వనాథ, కేశవన్ గ్రామస్తులు పాల్గొన్నారు.