17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఏడాది యాదిలో కొత్త టీచర్లు

07-10-2025 12:00 AM

2024 డీఎస్సీ ద్వారా ఎంపికయిన 10, 500 మంది ఉపాద్యాయులు అక్టోబర్ 9వ తేదీతో ఒక సంవత్సరం సర్వీస్‌ను పూర్తి చేసుకోనున్నారు. నియామకమైన కొత్త టీచర్లు ఏడాది కాలంగా అనేక అంశాల్లో విన్నూత పద్ధతిలో బోధన చేయడంతో ఎంతో పరిణితి సాధించారు. 2023--2024 డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కొరకు అనేక సార్లు ధర్నాలు, ఆందోళనలు జరిగాయి. గతంలో డీఎస్సీపై డిమాండ్స్ లేనప్పటికీ ఉమ్మడి రాష్ర్టంలో వరుసగా డీఎస్సీ నోటిఫికేషన్‌లు జారీ అయ్యేవి.

కానీ రాష్ర్ట ఆవిర్భావం తర్వాత 2017, 2024లో రెండుసార్లు మాత్రమే డీఎస్సీ పరీక్ష జరిగింది. అయితే ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడంలో కాలయాపనతో అభ్యర్థులు డీఎస్సీ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లి విజయం సాధించారు. అనేక ఆందోళనలతో 2023లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే అతి తక్కువ పోస్టులు మంజూరు చేయడంతో అభ్యర్థులు నిరాశ చెందారు. అప్పుడే సాధారణ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది.

రేవంత్ సర్కార్ అదనపు పోస్టులు కలిపి మొత్తంగా 11,062 టీచర్ పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షల నిర్వహణ, 2024 సెప్టెంబర్ 30న ఫలితాలు విడుదల, అక్టోబర్ 9వ తేదిన నియామక పత్రాలు అందుకోవడం వెనువెంటనే జరిగాయి. ఇక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిద్దాం. 

 రావుల రామ్మోహన్ రెడ్డి, కరీంనగర్