మిట్యాతండాలో కొత్త పంచాయితీ
ఇరువర్గాలుగా చీలిన ప్రజాప్రతినిధులు
మహబూబాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): పరిపాలన సౌలభ్యం, మారు మూల పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభు త్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేస్తే, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఏకా భిప్రాయం లేక కొత్త ‘పంచాయతీ’లు తలెత్తుతున్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తలిస్తే.. ఆచరణలో మరొకటి గా మారి అధికారులకు పెద్ద ‘తలనొప్పి’ తెచ్చిపెడు తున్నాయి.
మహబూబా బాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో కొత్తగా ఏర్పడ్డ మిట్యా తండా గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ నుండి 20 లక్షల రూపా యలు నిధులు మంజూరయ్యాయి. ఈ క్ర మంలో గ్రామ సర్పంచ్ భూక్యా చిన్ని ఆధ్వర్యంలో మిట్యా తండా జీ పీ పరిధిలోని పం తులు తండాలో కొత్తగా జీపీ భవనాన్ని ని ర్మించాలని తలచి సోమవారం భూమి పూ జ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అయితే మి ట్యా తండా గ్రామపంచాయతీ భవనాన్ని పంతులు తండాలో నిర్మించకూడదని, మీ ట్యా తండాలోనే నిర్మించాలంటూ ఉపసర్పంచ్ గుగులోతు రంగమ్మ తో పాటు వా ర్డు సభ్యులు కొందరు పంచాయతీకి దిగారు. సర్పంచ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే కొత్త పంచాయతీ నిర్మాణ ప్రదేశాన్ని మార్చాలంటూ ఇనుగుర్తి, నెల్లికుదురు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు.
అయితే మీట్యా తండాలో పంచాయతీ భవ నం నిర్మించడానికి అనువైన స్థలం లేదని, అటవీ శాఖ స్థలం ఉందని, అందుకనే పం తులు తండాలో నిర్మించ తలపెట్టిన ట్లు స ర్పంచ్ భూక్యా చిన్ని చెబుతున్నారు. అయితే కొత్త పంచాయతీ భవన నిర్మాణం విషయంలో మీట్యా తండా గ్రామపంచాయ తీ పరిధిలోని ఐదు తండాలకు చెందిన ప్ర జా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు ఇరు వర్గాలుగా విడిపోవడంతో కొత్త పంచాయతీ భవన నిర్మాణం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
కొత్త పంచాయతీ భవన నిర్మా ణం విషయంలో మీట్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, పా ర్టీల నాయకులు పంతం వీడకపోవడంతో ఈ వ్యవహారం కాస్త అధికారులకు తలనొప్పిగా మారింది. విడవమంటే పాముకు కో పం.. కరవమంటే కప్ప కోపం అన్న చం దంగా మీట్యా తండా గ్రామపంచాయతీ భ వన నిర్మాణ వ్యవహారం అధికారులకు చిక్కు తెచ్చిపెట్టింది.
చిన్న గ్రామపంచాయతీ ఐక్యమత్యంగా ఉండి అభివృద్ధి కోసం బాటలు వేసుకోవలసిన పరిస్థితి లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా బే షజాలకు పోకుండా ప్రజా ప్రతినిధులు, పా ర్టీల నేతలు పంచాయతీ భవన నిర్మాణంతోపాటు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం సమిష్టిగా ముందుకు సాగాలని, సంఘటితం గా ఉంటే ప్రభుత్వపరంగా సహకరిస్తామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.






