సర్ చుట్టూనే పార్టీల వ్యూహాలు
అప్రమత్తమైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ
వలసలతో మారుతున్న ఓటర్ల సమీకరణాలు
స్వల్ప ఓట్ల తేడాతోనే అభ్యర్థుల గెలుపోటములు
అందుకే కొత్త ఓటర్లు, డూప్లికేట్‌ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి) : ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమ యం ఉన్నా.. తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. దీనికి ప్రధా న కారణం ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐ ఆర్). ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీల వ్యూహాలకు కేంద్రబిందువుగా మారింది.
ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ‘సర్’ రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో.. తెలంగాణలోనూ ఈ ప్రక్రియపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సర్ కేవలం ఓటరు జాబితాల సవరణ ప్రక్రియగానే కాకుండా పెద్ద రాజకీయ వివాదంగా మారింది. ముఖ్యంగా బీహా ర్, పశ్చిమ బంగాల్ వంటి రాష్ట్రాల్లో చేపట్టిన సర్ అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది.
ఓటరు జాబితాల నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగిస్తున్నారని, అర్హులైన ఓటర్లు.. ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆరోపించగా, ఎన్నికల సంఘం మాత్రం అక్రమ నమోదులు, మరణించిన వ్యక్తుల పేర్లు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారిన వారి వివరాల ను తొలగించి ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యమ ని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు జాతీ య స్థాయిలో రాజకీయ చర్చకు దారితీశాయి.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరుగుతోంది? అర్హులైన ప్ర తి పౌరుడి ఓటు హక్కు రక్షించబడుతోందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. దీంతో సర్ పై రాజకీయ పార్టీల అప్రమత్తత మరింత పెరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా సర్ ప్రారంభం కావడంతో ఇదే తరహా పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని పార్టీలు బూత్ స్థాయి నుంచే కసరత్తు ప్రారంభించాయి.
దాదాపు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ధృవీకరణతో ఈ ప్రక్రియ చేపడుతుండటంతో రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలోని సుమారు 3.38 కోట్ల మంది ఓటర్ల వివరాలను మరోసారి సమగ్రంగా పరిశీలించే కా ర్యక్రమం కొనసాగుతోంది.
మరోవైపు హైదరాబాద్ మహానగరం, దాని శివారు ప్రాంతా ల్లో వేగంగా పెరిగిన జనాభా, భారీ వలసలు, కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్ కల్చర్ కారణంగా ఓటరు జాబితాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రాథమిక పరిశీలనలో సుమారు 88 లక్షల నమోదులు ధృవీ కరణ అవసరమున్నవిగా గుర్తించడంతో ఈ ప్రక్రియ ప్రాధాన్యా న్ని మరింత పెంచింది.
అన్ని పార్టీల అప్రమత్తత..
తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభం కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో అప్రమత్తమయ్యాయి. ఎన్నికలు గెలిచేందుకు ఓటర్ జాబితానే కీలకం కావడమే పార్టీల అప్రమత్తతకు ప్రధాన కారణంగా మారింది. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి వ్యక్తి పేరు ఉండేలా చూసుకోవడం, తమ అనుకూల ఓటు బ్యాంక్‌కు చెందిన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా పర్యవేక్షించడం ఇప్పుడు ప్రతి పార్టీకి కీలక బాధ్యతగా మారింది.
గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములు కొన్ని వందల నుంచి కొన్ని వేల ఓట్ల తేడాతోనే నిర్ణయమయ్యాయి. దీంతో కొన్ని వేల కొత్త ఓటర్ల నమోదు, డూప్లికేట్ నమోదుల తొలగింపు, చిరునామా మార్పులు వంటి అంశాలు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం తదితర పార్టీలు ఇప్పటికే బూత్ స్థాయి కమిటీలను చురుగ్గా మార్చాయి.
ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలను పరిశీలించడం, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయించడం, జాబితాలో ఉన్న లోపాలను గుర్తించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు పోటాపోటీగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు, ఏజెంట్లకు దిశా నిర్దేశం చేస్తున్నాయి.
దీంతోపాటు సర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని అన్ని పార్టీలు కో రుతున్నాయి. అర్హులైన ఒక్క ఓటరు కూ డా జాబితా నుంచి తప్పిపోకూడదని, ప్రతి అభ్యంతరాన్ని నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఎన్నికల సంఘాన్ని కోరు తున్నాయి.
పారదర్శకతే అసలు సవాల్..
సర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడం ఎన్నికల సంఘానికి అతిపెద్ద సవాల్‌గా మారింది. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడటంతో పాటు, అనర్హులు, డూప్లికేట్ నమోదులు, మరణించిన వ్యక్తుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించడం వంటి బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. రాష్ట్రంలో సుమారు 3.38 కోట్ల మంది ఓటర్ల వివరాలను మరోసారి ధృవీకరించే ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో, చిన్న పొరపాటు కూడా రాజకీయ వివాదానికి దారితీసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాల్లో సర్‌పై రాజకీయ విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణలో ప్రతి దశ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలనే డిమాండ్ అన్ని పార్టీల నుంచి వినిపిస్తోంది. ఓటరు పేరు తొలగించినా, కొత్తగా నమోదు చేసినా.. దానికి స్పష్టమైన కారణాలు, నిబంధనలు ప్రజలకు తెలియజేయడం, అభ్యంతరాలు చెప్పేందుకు తగిన అవకాశం కల్పించడం, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం ఎన్నికల సంఘానికి కీలక పరీక్షగా మారింది.
సర్ ప్రక్రియ విజయవంతగా పూర్తి అయిందనే అంశాన్ని కేవలం ఎన్ని పేర్లు చేర్చారు, ఎన్ని తొలగించారు అన్న సంఖ్యలతో కొలవలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం ప్రక్రియపై ప్రజలు, రాజకీయ పార్టీలు విశ్వాసం వ్యక్తం చేసినప్పుడే అది విజయవంతమైన సర్‌గా గుర్తింపు పొందుతుందని చెబుతున్నారు. అందుకే తెలంగాణలో ఇప్పుడు ఓటరు జాబితా కంటే.. ఆ జాబితా తయారీ ప్రక్రియపై పారదర్శకతే అసలు పరీక్షగా మారింది.
కొత్త ఓటర్లపైనే ప్రత్యేక దృష్టి..
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలూ కొత్త ఓటర్ల పైనే ప్రత్యేకంగా దృష్టి సారించాయి. వచ్చే ఎన్నికల నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకుని తొలిసారిగా ఓటు హక్కు పొందనున్న యువత సంఖ్య గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో, ఈ వర్గం ఎన్నికల ఫలితాలను ప్రభావి తం చేసే శక్తిగా మారే అవకాశముందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తు న్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల సం ఘం కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం తదితర పార్టీ లు కూడా అర్హులైన ప్రతి యువకుడిని ఓటరుగా నమోదు చేయించే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రస్తుత యువ ఓటర్లు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభి ప్రాయపడుతున్నారు. దీంతో ఈ వర్గం మద్దతు పొందేందుకు అన్ని పార్టీలు ఇప్పటి నుంచే ప్రత్యేక వ్యూ హాలు రూపొందిస్తున్నాయి.






