1 July, 2026 | 2:48 PM

దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్ ఇవ్వాలి

01-07-2026 01:40 PM

బోధన్,(విజయక్రాంతి): ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో జిల్లా కమిటీ పిలుపుల మేరకు భాగంగా.  బోధన్ ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా చేసి ఏ,ఓ. సాయిలు కు వినతి పత్రం అందజేశారు. సిఐటియు కార్మిక సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీడీడీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు. జై శంకర్ గౌడ్. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఏషాల. గంగాధర్. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు. భాగ్యలక్ష్మి. వారు ఇరువురు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం. జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా బిబిజి రామ్ జి చట్టం అమలు చేయిస్తుంది.

దేశవ్యాప్తంగా వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం 5వేలు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 6వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాన్ని అమలు చేయకుండా. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మాత్రమే అమలు చేయాలని. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని. విద్యుత్ సంస్కరణ చట్టం రద్దు చేయాలని. కోరుతూ కనీస మద్దతు ధర కల్పించాలని. దేశవ్యాప్తంగా వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం 5000 పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 6000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ పైన ఆర్డిఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఏవో సార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

గతంలో ఉపాధి పనిలో రాష్ట్ర ప్రభుత్వం 10% కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించి పనిని కల్పించేది కానీ దాన్ని మార్చి రాష్ట్ర ప్రభుత్వం 40% కేంద్ర ప్రభుత్వం 60 శాతాన్ని పెడుతూ ఉపాధి హామీ కూలీలకు పని లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికే గ్రామాలలో వికలాంగులకు ఉపాధి పని కల్పించకుండా అంకులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు కొత్త చట్టం పేరుతో ఫోటో క్యాప్స్ పేరుతో పని లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి

వీటిని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని లేనిపక్షంలో గల్లి నుంచి ఢిల్లీ దాకా దేశవ్యాప్తంగా అన్ని ప్రజాసంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. దీనితోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తూ పాత పద్ధతిలోని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక NpRD. జిల్లా అధ్యక్షులు గైని రాములు. డివైఎఫ్ఐ. జిల్లా నాయకులు దాసి గోపి. ఎన్ పి డి డి జిల్లా ఉపాధ్యక్షులు కాలగడ్డ రాజు. జిల్లా సహాయ కార్యదర్శి ముంజం సాయిలు. జిల్లా కమిటీ సభ్యులు. రైముద్దిన్. ఆరిఫ్ ఖాన్. తదితరులు పాల్గొన్నారు.