07-10-2025 12:00:00 AM
ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఒక రికార్డ్ అసిస్టెంట్‌ను కానీ జూనియర్ అసిస్టెంట్ పోస్టును కానీ మంజూరు చేయాలి. ఈ మధ్య కాలంలో చాలా ప్రాథమికోన్నత పాఠశాలలు.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ అయిన సంగతి తెలిసిందే. ప్రాథమికోన్నత పాఠశాలలు ఇలా జిల్లా పరిషత్ పాఠశాలలుగా మారడం వల్ల అందులో పనిచేస్తున్న బోధనా సిబ్బందిపై అదనపు పని భారం పడుతుంది.
దీనివల్ల ఇటు బోధన అటు బోధనేతన పనులు చేయలేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులకు పని భారం తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రతి పాఠశాలకు రికార్డ్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్‌ను నియమించాల్సిన అవసరముంది. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపట్టాలి.
వీరి ప్రక్రియ పూర్తయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో బోధనేతర పనిని మొత్తం వీళ్లే పరిశీలిస్తారు. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి దొరకడంతో పాటు టీచర్లకు పని భారం తగ్గుతుంది. ఒకవేళ ఉద్యోగ నియామక ప్రక్రియ ఆలస్యమవుతుందనకుంటే కారుణ్య నియామక ప్రక్రియ ద్వారానైనా ఉద్యోగ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
షేక్ అస్లాం షరీఫ్, హైదరాబాద్