భాగిర్తిపల్లి యువజన కాంగ్రెస్ నూతన కమిటీ
19-08-2026 08:42 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం భాగిర్తిపల్లి గ్రామ యువజన కాంగ్రెస్ నూతన కమిటీని భిక్కనూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ ప్రకటించారు. గ్రామ అధ్యక్షుడిగా చాపల కుమార్, ఉపాధ్యక్షుడిగా జంగమ అరవింద్, ప్రధాన కార్యదర్శిగా మహేష్‌ను నియమించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన కమిటీకి సూచించారు. కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వడ్ల స్వామి, నాయకులు పెద్దపొట్టి సుధాకర్, చాకలి రమేష్ తదితరులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.






