19 August, 2026 | 10:20 PM

ఉద్యోగ, ఉపాధ్యాయుల జంగ్ సైరన్

19-08-2026 08:39 PM

పిఆర్సిని వెంటనే అమలు పరచాలి

ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతల డిమాండ్

కామారెడ్డి,(విజయక్రాంతి): పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జెఎసి ప్రతినిధులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈనెల 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ డిమాండ్ల సాధన కోసం జంగ్ సైరన్ ముగించడం జరుగుతుందన్నారు. పీఆర్సీని సాధించడం సిపిఎస్ ను రద్దు చేయించడం ఈ హెచ్ ఎస్ ను వెంటనే అమలు చేయాలి.

పై డిమాండ్ల సాధన కోసం కామారెడ్డి లోని మున్సిపల్ ముందర ధర్నా నిర్వహిస్తామని కామారెడ్డి జిల్లా జే ఏసి ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర శాఖ టిజీజేఏసీ పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క మేనిఫెస్టోలో సిపిఎస్ ను రద్దు చేస్తామని ప్రకటించినది సమయం ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు దాటిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం కడు శోచనీయం అన్నారు.  ప్రభుత్వానికి సమయం ఇప్పటికే ఎక్కువ ఇచ్చాం ఇక శాంతంగా ఉండదలచుకోలేము ఉద్యమానికి సిద్ధమవుతున్నా మని పేర్కొన్నారు. జంగ్ సైరన్ మోగించినాము అని అన్నారు.