calender_icon.png 4 October, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లైన వారం రోజులకే నవవధువు ఆత్మహత్య

04-10-2025 11:51:46 AM

హైదరాబాద్: జగిత్యాల జిల్లా ఎర్దండి(Eradandi) గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివాహం జరిగి వారం రోజులకే నవ వధువు(Newlywed bride) ఆత్మహత్య చేసుకుంది. సెప్టెంబర్ 26న సంతోష్‌తో అల్లెపు గంగోత్రి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో సెప్టెంబరు 26న జంట పెళ్లి జరిగింది. దసరా పండుగ రోజున నవ దంపతులు గంగోత్రి ఇంటికి వెళ్లారు. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో గంగోత్రి ఇంట్లో దంపతుల మధ్య గొడవ జరిగింది. అనంతరం సంతోష్ భార్యతో కలిసి తన ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటికే మనస్తాపం చెందిన గంగోత్రి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. కుటుంబ సభ్యలు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. భర్తతో జరిగిన గొడవ, అత్తింట్లో సమస్యల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేసింది.