calender_icon.png 4 October, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

04-10-2025 11:19:33 AM

26 గేట్లను ఎత్తిన అధికారులు

హైదరాబాద్: నాగార్జునసాగర్(Nagarjuna Sagar) జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 గేట్లను ఎత్తిన అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం ఇన్ ఫ్లూ 2.70 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్ జలాశయం ఔట్ ఫ్లూ 2.70 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సాగర్ కుడి కాల్వకు 10,040 క్యూసెక్కుల నీరు, ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు, నాగార్జున సాగర్ పవర్ హౌస్ కు 33,291 క్యూసెక్కులు, నాగార్జున స్పెల్ వే ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 587.30 అడుగులు ఉంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు, సాగర్ జలాశయం ప్రస్తుత నీటి నిల్ల 305.68 టీఎంసీలుగా ఉందని నాగార్జున సాగర్ సంబంధింత అధికారులు పేర్కొన్నారు. గేట్లు ఎత్తడంతో పర్యటకులు భారీగా నాగార్జున సాగర్ డ్యామ్ ను చేసేందుకు వెళ్తున్నారు.