8 May, 2026 | 1:06 AM

పెళ్లయిన రెండు నెలలకే నవవధువు అనుమానాస్పద మృతి

08-05-2026 12:00 AM

చిన్నచింతకుంట, మే 7 : మండల పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన రెండు నెలలకే ఓ నవవధువు చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. మరికల్ మండలం ఎలిగండ్ల గ్రామానికి చెందిన చిన్న తిమ్మన్న కుమార్తె బోయ భారతికి అప్పంపల్లి గ్రామానికి చెందిన మండ్ల మహేష్తో గత మార్చి 8వ తేదీన వివాహం జరిగింది. బుధవారం మే 6న ఉదయం సుమారు 11 గంటల సమయంలో భారతి తన అత్తగారి ఇంట్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన భర్త అత్తమామలు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో భారతి సాయంత్రం కన్నుమూసింది. తన కుమార్తె మృతిపై తండ్రి చిన్న తిమ్మన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతి ఏదైనా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందా? లేదా ఇతర అనారోగ్య సమస్యల వల్ల మరణించిందా? అనే కోణంలో విచారణ చేపట్టాలని కోరారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్త్స్ర ఓబుల రెడ్డి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు, నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల పూర్తి కారణాలు తెలుస్తాయని  వెల్లడించారు.