17 August, 2026 | 2:14 AM

మొన్న ప్రశంసా పత్రం.. నిన్న కన్నుమూత

17-08-2026 01:43 AM

ప్రజల ప్రాణాలు కాపాడిన 108 ఉద్యోగి గుండెపోటుతో మృతి

అలంపూర్, ఆగస్టు 16: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఐదేళ్లుగా 108 అత్యవ సర సేవల్లో అంకితభావంతో పనిచేసిన ఎ మర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఎండి జాంగిర్ పాషా జీవితం విషాదాంతమైంది. తన సేవలకు గుర్తింపుగా శనివారం స్వాతంత్య్ర వేడు కల్లో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఆ ఆనందం కుటుంబ సభ్యులతో పంచుకునేలోపే ఆదివారం తెల్లవారుజామున గుండె పోటుతో కన్నుమూశారు.

రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచిన ఆయన సేవలను గుర్తించిన అధికారులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రంతో సత్కరించారు. అయితే, ఆ ప్రశంసా పత్రం అందు కున్న 24 గంటలు గడవకముందే ఆదివారం తెల్లవారుజాము న 2.15 గంటల సమయంలో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ఆయన మృతితో భార్య, ఇద్దరు కుమార్తెలు ఆధారాన్ని కోల్పోయారు.