కోదండరాంను కలిసిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు
29-05-2024 02:08 AM
వరంగల్, మే 28 (విజయక్రాంతి): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. జీవో 510 ద్వారా సుమారు ౪ వేల మందికి అన్యాయం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఆ జీవో ద్వారా నష్టపోయిన వారందరికీ రెగ్యులర్ బేసిక్ ఉద్యోగుల వేతనంతోపాటు క్యాడర్ ఫిక్సినేషన్ కూడా 2018 నుంచి అమలు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, సురేశ్‌గౌడ్, లోకేశ్, శ్రీనివాస్, నవకాంత్, గౌరీ, చంద్రకళ, శ్రీలక్ష్మి, మధు తదితరులు పాల్గొన్నారు.






