29 July, 2026 | 4:47 PM

ఎల్లమ్మ సిద్ధోగంలో కేటీఆర్

29-05-2024 02:08 AM

రాజన్న సిరిసిల్ల, మే28 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. రేణుక ఎల్లమ్మ సిద్ధోగంలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిరహించారు. ఆలయంలో ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అమ్మవార్ల ఆశీస్సులతో సకాలంలో వరాలు కురిసి,పాడి పంటలు సమృద్ధిగా పండి రాష్ర్టం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గౌడ సంఘ సభ్యులు కేటీఆర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ డైరెక్టర్ నారాయణరావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకటసామిగౌడ్, మాజీ జడ్పీటీసీ నర్సాగౌడ్ పాల్గొన్నారు.