29 July, 2026 | 3:10 PM

కామారెడ్డిలో కేంద్ర బృందం పర్యటన

29-05-2024 02:11 AM

కామారెడ్డి, మే 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన నష్టం వివరాలను మంగళవారం కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ బృందం ప్రతినిధులు తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల జంగంపల్లి, కాచాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అకాల వర్షాలతో ధాన్యం నష్టపోయిన వివరాల గురించి రైతులతో మాట్లాడారు. బీబీపేట్ మండలం మందాపూర్, దోమకొండ మండలం అంబారిపేట్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.  రాజంపేట మండలం తలమడ్ల గ్రామాల్లో పర్యటించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మల్లికార్జున్‌బాబు, ఇన్‌చార్జి మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తహశీల్దార్లు కిష్టయ్య, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.