మూసీ ప్రాజెక్టుపై ఎన్‌హెచ్‌ఆర్సీ కేసు నమోదు
- పర్యావరణ విధ్వంసం, చెట్ల నరికివేతపై సీరియస్
- ఎలాంటి అధ్యయనం లేకుండానే పనులంటూ న్యాయవాది రామారావు ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 3 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూసీ సుందరీకరణ పేరుతో నదీ తీర ప్రాంతాల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై జాతీ య మానవ హక్కుల కమిషన్ ఎన్‌హెచ్‌ఆర్సీలో కేసు నమోదైంది.
ఎలాంటి పర్యావర ణ, సామాజిక ప్రభావ అధ్యయనం చేయకుండానే లంగర్‌హౌస్, నార్సింగి, రాందేవ్ గూడ తదితర ప్రాంతాల్లో శతాబ్దాల నాటి వేలాది చెట్లను విచక్షణారహితంగా నరికేస్తున్నారని మానవ హక్కుల న్యాయవాది రా మారావు ఇమ్మనేని ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కమిషన్, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిం ది.
ఈ ప్రాజెక్టు పనుల వల్ల స్థానిక ప్రజల జీవనాధారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని, పచ్చని మూసీ తీరాలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేస్తున్నారని ఫిర్యాదులో రామారావు ప్రధానంగా ఆరోపించారు. స మగ్రమైన ప్రణాళిక, ముందస్తు అధ్యయనం లేకుండానే అధికారులు ఇష్టారాజ్యంగా వ్య వహరిస్తున్నారని అన్నారు.
పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న ఈ చర్యలను తక్షణమే నిలిపివేసేలా మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ఈవీ నరసింహారెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.చెట్ల నరికివేతను తక్షణమే అడ్డుకోవడంతో పా టు, నష్టపోతున్న నిర్వాసిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందే లా చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్సీని కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వ యంత్రాం గం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎట్టి పరిస్థితు ల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.




