4 March, 2026 | 1:47 AM

రెగ్యులరైజ్ అయ్యేనా?

04-03-2026 12:03 AM

రెండేళ్లుగా 450 మంది జూనియర్ కార్యదర్శుల ఎదురుచూపు

సంగారెడ్డి, మార్చి 3(విజయక్రాంతి): ఆరేళ్ళ క్రితం ఉద్యోగం పొందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 2019లో జూనియర్ కార్యదర్శులుగా జిల్లాలో నియామకం అయినప్పటి నుండి ఇప్పటి వరకు వారికి రెగ్యులరైజ్ కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇందుకు జిల్లా పంచాయతీ కార్యాలయంలో రెగ్యులర్ డీపీవో లేకపోవడంతో సర్వీసు జాబితా తయారు చేయలేక పోయారు. ఇం చార్జి బాధ్యతలు స్వీకరించిన జడ్పీ సీఈవో ను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎన్నికల నే పథ్యంలో పట్టించుకోలేదు. అయితే ఇటీవలిగా సిర్గాపూర్ మండలం పోచాపూర్ పం చాయతీలో పనిచేస్తున్న జూనియర్ కార్యదర్శి రాజశేఖర్ అనారోగ్యంతో మృతి చెం దాడు.

అయితే అతనికి రెగ్యులర్ కాకపోవడంతో అతనికి సర్వీసు పరంగా రావాల్సిన రాయితీలు, కుటుంబంలో ఉద్యోగం రా కుండా పోయాయి. ఒకవేళ రెగ్యులర్ అయివుంటే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేదని పలువురు జూనియర్ కార్యదర్శులు వాపోతున్నారు. 

రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూపులు...

జిల్లాలో సుమారు 450 మంది వరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరందరు 2019 ఏప్రిల్ నెలలో ఉద్యోగంలో చేరారు. వీరికి మూడేళ్ళ తర్వాత రెగ్యులరై జ్ చేయాలి. కానీ రే వంత్రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మూడేళ్ళ ప్రొహిబిషన్ కాలాన్ని నా లుగేళ్ళకు పొడిగించారు. నాలుగేళ్ళ తర్వాత రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు అందించాలి. అయితే 2019 నుంచి రెగ్యులర్ ఉత్తర్వుల కోసం జూనియర్ కార్యదర్శులు ఎదురుచూస్తున్నారు.

ప్రొహిబిషన్ కాలం ముగిసి రెండే ళ్ళు గడుస్తున్నా ఇంతవరకు వారిని రెగ్యులర్ చేయలేదు. గత డీపీవో సాయిబాబా ఎంపీడీవోలను ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశించడంతో ఒకటి, రెండు మండలాల్లో ప్రారంభించినా ముందుకు సాగలేదు. ఇతర జిల్లాల్లో జూనియర్ కార్యదర్శులను గ్రేడ్-4 ఉద్యోగులుగా రెగ్యులర్ చేశారు. కానీ సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. గత డీపీవో అవినీతి, అక్రమాల వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామని జూనియర్ కార్యదర్శులు వాపోతున్నారు. 

ఆగిపోయిన పదోన్నతులు...

జిల్లాలో పనిచేస్తున్నగ్రేడ్-3 కార్యదర్శులకు పదోన్నతులు సైతం ఆగిపోయాయి. ఇందుకు రెగ్యులర్గా డీపీవో లేకపోవడంతో ఇంచార్జిగా జడ్పీ సీఈవోను కేటాయించడంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయా యి. నోషనల్ ప్రమోషన్లు పొందాల్సిన ఉద్యోగులు రెగ్యులర్ డీపీవో లేకపోవడంతో వారి జాబితా లిస్టు తయారు చేయలేదు. దీంతో వారి ప్రమోషన్లు ఆగిపోయాయి. ఈ విషయంలో పట్టించుకున్న అధికారులు లే రు. గ్రేడ్ 3 ఉద్యోగులకు గ్రేడ్-2, గ్రేడ్ -1 పదోన్నతులు రావాల్సినవారు ఎదురుచూపుల తోనే కాలం వెళ్ళదీస్తున్నారు.