6 July, 2026 | 9:04 PM

Breaking News

రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •   అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ   •   జర్నలిస్టుల స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •  

నిమ్జ్ భూసేకరణ పనులను వేగవంతం చేయాలి

28-05-2025 01:32 AM

కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి, మే 27(విజయక్రాంతి): రీజనల్ రింగ్ రోడ్డు, నిమ్జ్ పూర్తయితే జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో  రెవిన్యూ, నిమ్జ్ ప్రత్యేక అధికారులతో  భూసేకరణపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిమ్జ్కు 12,500  ఎకరాలకు 7500 ఎకరాలు భూ సేకరణ చేసి సేకరించిన భూమికి రక్షణ కంచెను ఏర్పాటు చేయాలన్నారు.

రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే రవాణా సులభతరం అవుతూ విద్య, వాణిజ్య, వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్జ్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్ నియోజకవర్గాల రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నిమ్జ్ ఏర్పాటుకు భూములు ఇచ్చిన వారికి నష్టపరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ విషయంపై ఆయా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్  కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్డిఓ, తహసిల్దార్లు పాల్గొన్నారు.