21-01-2026 12:00:00 AM
నిర్మల్, జనవరి 20 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్మల్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తదితరులు ప్రారంభించారు నిర్మల్ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రాచీన పనిముట్లు పాట వస్తువుల ప్రదర్శన ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రజలు గ్రామీణ ప్రజలు తరలివచ్చి ఉత్సాహంగా గడుపుతున్నారు. సాయంత్రం వేళ్లలో పిల్లలు, పెద్దలు ఆనందంగా గడపేలా నిర్మించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు