calender_icon.png 21 January, 2026 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు మున్సిపాలిటీలు గెలుచుకుంటాం

21-01-2026 12:00:00 AM

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి

నిర్మల్ జనవరి 21 (విజయక్రాంతి) : త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ మున్సిపల్ స్థానాలను బిజెపి కైవసం చేసుకుంటుందని బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సమష్టిగా కృషి చేసి నిర్మల్ మున్సిపాలిటీ పై కాషాయ జెండా ఎగరేసేవిధంగా సమాయత్తం కలవాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సుపరిపాలనను, విప్లవాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ప్రభారి బస్వ లక్ష్మీ నర్సయ్య, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, జిల్లా మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, నిర్మల్ మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపె విలాస్, కో కన్వీనర్ సీనియర్ నాయకులు మేడిసెమ్మ రాజు, డా మల్లకార్జున రెడ్డి, అయ్యన్న గారి రాజేందర్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ఒడిసెల అర్జున్, అరవింద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.