calender_icon.png 21 January, 2026 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

21-01-2026 12:00:00 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు

అరైవ్ అలైవ్ పోస్టర్ ఆవిష్కరణ

ఆదిలాబాద్, జనవరి 20 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, ప్రమాదాలను నివారిస్తూ, ప్రాణ నష్టాన్ని తగ్గించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వాటర్ లో ఏర్పాటు చేసిన ‘అరైవ్ అలైవ్‘ అనే కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి సీఎం రాజ్యలక్ష్మి తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులతో కలిసి ‘అరైవ్ అలైవ్‘ పోస్టర్ లను జడ్జి ఆవిష్కరించారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, పరిపాలన ఏఎస్పి మౌనిక, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథో డ్, డిఎస్పి జీవన్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్, పీపీ సంజయ్ వైరాగరి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, ఐఎం ఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కళ్ళెం వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సుజాత, కళాశాల విద్యార్థులు, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు, డ్రైవర్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.