నీతి అయోగ్ బెస్ట్ సెమినార్‌లో నిర్మల్ కలెక్టర్
నిర్మల్, మార్చి 9 (విజయక్రాంతి): నీతి ఆయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్ లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అరుదైన ఘనతను సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన సెమినార్లో ఆమె పాల్గొన్నారు. భాగంగా నీతి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాకు కార్యక్రమం కింద పెంబి మండలంలో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, తదితర మౌళిక సదుపాయాల కల్పనలో చేసిన కృషి, తద్వారా సాధించిన ప్రగతి వివరాలు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పెంబి అభివృద్ధిలో ఎదురైన సవాళ్లు, చేపట్టి చర్యలు సెమినార్ లో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎంపిక కాగా అందులో నిర్మల్ స్థానం లభించడం సంతోషం వ్యక్తం చేశారు సమిష్టి కృషితో దీన్ని సాధించామని ఆమె తెలిపారు.




