10 March, 2026 | 2:31 AM

అధ్యక్షులు సరే.. జిల్లా కమిటీ మాటేమిటి?

10-03-2026 01:01 AM

నిర్మల్ జిల్లాలో కొలిక్కిరాని కాంగ్రెస్ జిల్లా కమిటీ కూర్పు 

మండల కమిటీ లేక కాంగ్రెస్ డీలా..

ఆశావాదులకు తప్పని ఎదురుచూపు 

నిర్మల్, మార్చి 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం అధికారుల్లో ఉంద న్న ధీమా తప్ప.. పార్టీలో ఉన్న ముఖ్య నేతలకు మాత్రం పదవుల కోసం వేచి చూడక తప్పడం లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభు త్వం 2023 డిసెంబర్లో అధికారులకు వచ్చింది. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడంతో తమ బతుకులు బాగు పడి ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతామని ఆశపడ్డ లీడర్లకు పార్టీ అనుసరిస్తున్న విధానం తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. నిర్మల్ జిల్లాలో నిర్మల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్‌ను మూడు నెలల క్రితమే జిల్లా అధ్యక్షుడిగా నియమించింది.

జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన వెడుమ బొజ్జు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల కమిటీలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కాగా, జిల్లాలో ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సంయుక్త కార్యదర్శి, అధికార ప్రతినిధులు, పాటు మహిళా విభాగం యూత్ విభాగం సేవాదళ్, తదితర జిల్లా కమిటీలను పూర్తిస్థాయిలో ప్రకటించవలసి ఉంది. దీనికి తోడు జిల్లాలోని 18 మండలాలతో పాటు ,భైంసా నిర్మల్ ఖానాపూర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు వివిధ విభాగాల కమిటీలను ఏర్పాటు ఏర్పాటు చేయవలసి ఉన్న ఇప్పటివరకు కమిటీని పూర్తిస్థాయిలో ప్రకటించక పోవడంతో పదవులపై ఆశ వున్న నిరాశకు గురి అవుతున్నారు అవుతున్నారు 

మండల కమిటీ తర్వాతే జిల్లా కమిటీ 

నిర్మల్ జిల్లాలో డీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ జిల్లా కమిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసి న కార్యకర్తలు ప్రజాపతుల నుంచి పదవుల కో సం దరఖాస్తులు స్వీకరించారు. నియోజవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని పాత కొత్త నేతల సమన్వయంతో జిల్లా కమిటీ ఏర్పాటు చేసినందుకు కసరత్తు ప్రారంభించారు. పార్టీ కూడా ఆ జిల్లాలో జిల్లా కమిటీ , మండల కమిటీ ఏర్పాటుపై జి ల్లా ప్రత్యేక పరిశీలకులుగా రెండు నెలల క్రితం ఇద్దరిని నియమించింది. వీరు నిర్మల్లో నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించి సీనియర్ జూనియర్ ప్రజాప్రతిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల కోసం దరఖాస్తులను స్వీకరించారు.

ఈ బాధ్యతను ఎమ్మె ల్యే వెడుమ  బొజ్జు పటేల్, మాజీ మంత్రులు వేణుగోపాలచారి ఏ ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లు విట్టల్ రెడ్డి నారాయణరావు పటేల్ నియోజకవర్గ ఇన్చార్జి సిఆర్ రావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జున్ తదితరులు సీనియర్ నేతల సమక్షంలో పార్టీకి విధేయతను గా ఉన్న పేర్లను సేకరించి పార్టీ పదవులు ఇవ్వాలని సిఫార్సు చేశారు. ఈ ప్రక్రియ నిర్వహించి రెండు నెలలు గడిచిన ఇప్పటివరకు జిల్లా కమిటీ పట్టణ కమిటీ, వివిధ విభాగాల కమిటీలను ప్రకటించకపోవడంతో పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలకు నిరాశ కలుగుతుంది. అన్ని మండలాల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతల అభిప్రాయలమెరకి జిల్లా మండల కమిటీలు వారికి అవకాశం కల్పించే విధంగా కసరత్తు జరుగుతుంది 

ప్రజా ప్రతినిధులు నారాజ్ 

జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ లో పనిచేస్తూ పదవుల కోసం రెండున్నర ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేతలు పదవులు రాకపోవడంతో నారాజ్ అవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 12 ఏళ్లు పూర్తి చేసుకోగా. రెండేళ్ల కాంగ్రెస్ పాలన కలుపుకొని 12 సంవత్సరాలుగా పదవులు లేక పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు తక్షణం పదవులను కేటాయించాల్సిన బాధ్యత కాంగ్రె స్ అధిష్టానం పై ఉంది.

ఇప్పటికీ సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలను నిర్వహించగా మరికొన్ని రోజులు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలను ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తుంది. అయితే పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో, మండలాల్లో, పార్టీ బాధ్యత మూసే కమిటీలు లేకపోవడంతో ప్రజాప్రతినిధులు ఐక్యత లోపించి పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికి నిర్మల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాలకు జిల్లా కమిటీ తో పాటు మండల కమిటీలో ప్రజా ప్రతినిధులకు సముచిత స్థానం కల్పిస్తేనే పార్టీకి ప్రయోజనం ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు. 

కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం 

కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు, ప్రజాప్రతినిధికి తప్పకుండా జిల్లా మండల కమిటీల్లో ప్రాథమిక కల్పిస్తాం. ఇప్పటికీ జిల్లాలో అన్ని మండలాల్లో మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన కసరత్తు జరుగుతుంది. పార్టీకి విధేయతగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళుతున్న ప్రతి కార్యకర్తల శ్రమను తప్పకుండా పార్టీ గుర్తించి పదవులను అప్పగిస్తుందని భరోసా ఇస్తున్నాం

 వేడ్మ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు