సార్ సర్వే పట్ల కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పించాలి
క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నిర్మల్ డిసిసి వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే SIR సర్వే పట్ల నాయకులకు అవగాహన కల్పించారు. ప్రతి బూత్ లో పూర్తి స్థాయిలో ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చెయ్యాలని, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలి అని దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే 84వ జన్మదిన వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే గారి 84వ జన్మదిన వేడుకలు ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లో నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా కేక్ కట్ చేసి నాయకులు,కార్యకర్తలు కేక్ తినిపించుకున్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరుపున జాతీయ అధ్యక్షులు ఖర్గేకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు జీవిత కాలం కష్టపడుతూ... పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎప్పటికీ అప్పుడు సమస్యలు లేవనెత్తుతూ ప్రజల పక్షాన పోరాడుతున్నారని అన్నారు.నాయకుడు ఖర్గే జన్మదిన సందర్భంగా వారికి ఆరోగ్యాలతో,ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.






