గాగిల్లాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం విజయవంతం
బెజ్జంకి,(విజయక్రాంతి): బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, బాలవికాస సంస్థ సహకారంతో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో మొత్తం 214 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా, 186 మందికి షుగర్ పరీక్షలు, 78 మందికి ఈసీజీ పరీక్షలు, రక్తపోటు పరీక్షలు నిర్వహించి, వైద్యుల సలహాలతో పాటు ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పులి కృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. సర్పంచ్ ఎర్రల జానకి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింతగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






