6 May, 2026 | 9:02 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

అది ఒక్క సిన్మాకే దక్కిన అవార్డు కాదు: నిత్యా మీనన్

17-10-2024 04:26 PM

ఉత్తమ నటిగా తన జాతీయ అవార్డును గెలుచుకున్న నిత్యామీనన్ తాజాగా తిరుచిత్రంబళం ఒక్క సినిమాకే వచ్చిన అవార్డు కాదని తెలిపారు. జాతీయ అవార్డు రావడంపై ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి నిత్యమీనన్ సంతోషం వ్యక్తం చేశారు. 'తిరుచిత్రంబళం'లోని పాత్రకే కాదని, ఇప్పటి వరకు తాను నటించిన పాత్రలన్నింటికి అవార్డు దక్కుతోందన్నారు. తిరుచిత్రంబళం చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఇటీవల నిత్యా మేనన్ జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

ఆమె నటనకు తన క్రాఫ్ట్ పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నిత్య శోభన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది ఆమెకు మొదటిసారిగా ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును అందించింది. ఇటీవల విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకకు నిత్యామీనన్ తన తల్లిదండ్రులతో కలిసి సంప్రదాయ చీర కట్టులో హాజరయ్యారు. ధనుష్ నటించిన తిరుచిత్రంబళంలో శోభన పాత్రలో అసాధారణమైన పాత్ర పోషించినందుకు ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.