ఫోన్‌ట్యాపింగ్ నిందితులకు నో బెయిల్
భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు బుధవారం కొట్టివేసింది. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరు.. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తమను పోలీసులు అరెస్ట్ చేశారని, ఈ కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని వారి తరపు న్యాయవాదులు వాదించారు.
అయితే, ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారిం చాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. బెయిల్ పిటిషన్లపై మంగళవారమే వాదనలు పూర్తికాగా వాటిని కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులను పోలీసులు అరెస్ట్ చేశారు.






