calender_icon.png 12 February, 2026 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు నేడే

12-02-2026 01:28:54 AM

ఓటు హక్కు  ఉన్న ఓటర్లు 12.7 కోట్ల మంది

ఢాకా, ఫిబ్రవరి ౧౧: బంగ్లాదేశ్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఉదయం ౭ గంటల నుంచి దేశవ్యాప్తంగా పోలింగ్ పారంభం కానుంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత, తిరిగి ఆ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 300 పార్లమెంటరీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం 299 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

ఒక స్థానంలో ఓ అభ్యర్థి అకాల మరణం కారణంగా ఎన్నిక వాయిదా పడింది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నది. పోలింగ్ పూర్తయిన మర్నాడే కౌంటింగ్, వెనువెంటనే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సుమారు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎన్నికలతో పాటే రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన ‘జూలై చార్టర్’ అమలుపైనా తాత్కాలిక ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) చేపడుతున్నది. ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్- -ఇస్లామీ మధ్య ప్రధాన పోటీఉంది. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం ఉంది. ఆ పార్టీ కాకుండా మిగతా రెండు పార్టీల్లో ఒక పార్టీదే ఇక అధికారం.