calender_icon.png 11 November, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు, చిన్నారుల భద్రతలో రాజీలేదు

11-11-2025 01:04:14 AM

పోక్సో, అత్యాచార కేసుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు 

నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్  

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. వారి భద్రత, రక్షణ కేవలం పోలీసుల బాధ్యతే కాదని, అదొక సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీసీ ఆడిటోరియంలో ఆయన మ హిళా భద్రతా విభాగం పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా, మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల పురోగతిని, దర్యాప్తు తీరును ఆయన ఆరా తీశారు. షీ టీమ్స్, భరో సా కేంద్రాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఏహెటీయూ, జువైనల్ విభాగాల పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి, వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధిత మహిళలతో మానవతా దృక్పథంతో, సున్నితంగా వ్యవహరించాలని సీపీ సజ్జనార్ సిబ్బందికి సూచించారు.

పోక్సో, అత్యాచార కేసుల దర్యాప్తులో ఏమాత్రం నిర్ల క్ష్యం వహించినా సం బంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మహిళలు, ఆడపిల్లల జోలికి వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని,  అలాంటి వారికి భవిష్యత్తులో పాస్‌పోర్టులు మంజూరు కావు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రాకుండా చర్యలు తీసుకుంటాం, అని స్పష్టం చేశారు.

పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు గుడ్ టచ్ - బ్యాడ్ టచ్, స్వీయరక్షణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సీపీ సూచించారు. ఆపరేషన్ స్ముల్, ముస్కాన్ వంటి ప్రత్యేక కార్యక్రమాలతో పాటు, నిరంతరం వీధి బాలలు, వెట్టిచాకిరి, పరి శ్రమల్లో మగ్గుతున్న బాల కార్మికులను గుర్తించి, వారిని రక్షించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అదనపు సీపీ క్రైమ్స్ శ్రీనివాస్, డీసీపీ మహిళా భద్రత లా వణ్య నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.