calender_icon.png 11 November, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమ పిడికిలి అందెశ్రీ

11-11-2025 01:06:39 AM

* మెదక్‌లో ప్రజా సంఘాల నివాళి

మెదక్ టౌన్, నవంబర్ 10 : తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి బిగిసిన పిడికిలి అందెశ్రీ అని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.కొండల్ రెడ్డి, తెలంగాణ ఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దొంతి నరేందర్, సీనియర్ కాంగ్రెస్ నేత మధుసూదన్ రావు కొనియాడారు. సోమవారం మెదక్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ప్రజా సంఘాలు నివా ళులర్పించాయి. ఈ సందర్భంగా సాహితీ రంగంతో పాటు తెలంగాణ ఉద్యమ నినాదాన్ని బిగిసిన పిడికిలిలా మార్చిన ఘనత అందెశ్రీకి దక్కుతుందని వక్తలు కీర్తించారు. అందెశ్రీకి మెతుకు సీమతో విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నాగరాజు, శంకర్, మానవ హక్కుల వేదిక నేత షేక్ అ హ్మద్, డీబీఎఫ్ నేతలు రామస్వామి, దయాసాగర్, నాయకులు మనోహర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.