ప్రణబ్‌కు కనీసం సంతాపసభ పెట్టలేదు
- దివంగత ప్రధాని పీవీని కూడా ఘోరంగా అవమానించారు
- షర్మిష్ఠ ముఖర్జీ ఆగ్రహం
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: తన తండ్రి 2020లో చనిపోతే ఆయనకు సంతాపం తెలపడానికి కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్‌ను ఏర్పాటు చేయలేదని, పలకరించిన వారుకూడా కరువయ్యారని దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు షర్మిష్ఠ ముఖర్జీ ధ్వజమెత్తారు. ఈ విషయంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని కూడా ఆరోపించారు.
రాష్ట్రపతులకు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసి సంతాపం తెలపడం పార్టీ సంప్రదాయంగా లేదని ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ఆనాడు తనతో చెప్పారన్నారు. కాగా, తన తం డ్రి ప్రణబ్ డైరీని చదవగా అది నిజం కాదని తెలిసిందని ఎక్స్ వేదికగా అ న్నారు. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మరణించినప్పుడు నివాళి అర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశమైనట్లు డైరీలో ఉందని తెలిపారు.
దిగంగత ప్రధాని పీవీ నరసింహారావును సైతం కాంగ్రెస్ పార్టీ అవమానించిందని శర్మిష్ఠ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పుస్తకాన్ని ఆమె ప్రస్తావించారు.
అందులో 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పీవీ నరసింహారావు స్మారక చిహ్నాన్ని నిర్మించలేదన్నారు. దీంతోపాటు ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో కాకుండా స్వస్థలమైన హైదరాబాద్‌లో జరపాలని కాంగ్రెస్ ఆదేశించిన విషయం ఆ పుస్తకంలో ఉందని చెప్పారు.






