calender_icon.png 4 December, 2024 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబ సర్వేకు సహకరించం

08-11-2024 12:59:37 AM

గుండంపల్లి మహిళా రైతుల తీర్మానం

నిర్మల్, నవంబర్ 7 (విజయక్రాంతి): దిలువార్‌పూర్ మండల కేంద్రం వద్ద ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేసేవరకు తాము ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరిస్తామని గుండంపల్లి మహిళా రైతులు గురువారం తీర్మానం చేశారు. గ్రామాల మధ్య ఫ్యాక్టరీని నిర్మించవద్దని తాము ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామానికి వచ్చిన అధికారులకు తీర్మాన ప్రతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో 100 మంది మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.