6 August, 2026 | 1:17 AM

భూసేకరణలో ఆలస్యం వద్దు!

06-08-2026 12:28 AM

నాగర్ కర్నూల్, ఆగస్టు 5 (విజయక్రాంతి): జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్ కేసులపై సమీక్షించారు. రైతుల హక్కులకు భంగం కలగకుండా పారదర్శకంగా భూసేకరణ చేపట్టాలని, పెండింగ్ అంశాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.