9 April, 2026 | 8:54 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

బీఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు

02-07-2025 05:31 PM

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..

చండూరు (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(Former MLA Koosukuntla Prabhakar Reddy) అన్నారు. బుధవారం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ ఎంపీపీ తోకల వెంకన్న భవనాన్ని కూల్చివేయడంపై చౌరస్తాలో నిరసన తెలియజేస్తూ, రోడ్డు విస్తరణ పనులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాజీ ఎంపీపీ తోకల వెంకన్నకు చెందిన భవనాన్ని కూల్చివేయడం ముమ్మాటికి రాజకీయ కక్ష అని ఆయన అన్నారు. అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి సహకారంతో 50 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు వారు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై 18 నెలలు కావస్తున్న మునుగోడు నియోజకవర్గ ప్రాంతానికి ఒక్క రూపాయి తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశావని ఆయన ఎద్దేవా చేశారు. రోడ్డు వెడల్పు పనులకు డిపిఆర్ లేకుండా ఒక దగ్గర 95 ఫీట్లు అని, మరొక దగ్గర 90 ఫీట్లు అని వారి అనుచర గణానికి, ముడుపులు ముట్టినచోట 85 ఫీట్లు అని ఇష్టానుసారంగా వ్వ హవరిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన అన్నారు.

కేసిఆర్ నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేశామని, త్యాగాలు చేశామని ఇలాంటి దగాకోరుకు భయపడేది లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు పెద్దింటి బుచ్చిరెడ్డి, కర్నాటి వెంకటేశం, బిఆర్ఎస్ కార్మిక విభాగం నల్లగొండ జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి, చండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, బిఆర్ఎస్ చండూరు మండల అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, కౌన్సిలర్లు తోకల వెంకన్న, కోడి వెంకన్న, గుంటి వెంకటేశం, బొడ్డు సతీష్, పెద్దగోని వెంకన్న, కురుపాటి సుదర్శన్, తేలుకుంట్ల చంద్రశేఖర్, జానయ్య తదితరులు పాల్గొన్నారు.