calender_icon.png 3 July, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్డీవో పర్యవేక్షణలో మిగులు స్థలాల తొలగింపు - చెర వీడిన అక్రమణ స్థలం

02-07-2025 05:36:59 PM

కుభీర్ (విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్ లో గత కొన్నేళ్ల నుండి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడకు అనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఒక వర్గానికి చెందిన కొందరు ఆక్రమించుకొని షెడ్లు వేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీని వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మేదరి గల్లి, ముఖ్యంగా శ్రీ విఠలేశ్వర ఆలయంలోనికి వర్షపు నీటితో పాటు మురికి నీరు చొరబడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై ఆలయ కమిటీ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav)కు ఫిర్యాదు చేయడంతో బైంసా ఆర్డివో కు ఆక్రమణకు గురైన స్థలాన్ని ఖాళీ చేయించే బాధ్యతను అప్పగించారు. గత వారంలోనే సామాన్లన్నీ తొలగించినప్పటికీ షెడ్లను తొలగించకుండా ఆక్రమణదారులు మళ్లీ కబ్జా చేసేందుకు యత్నం చేస్తున్నారని, తొలగింపులో మరో రెండు దుకాణాలను తీయకపోవడంతో తాజాగా జూన్ 30 తేదీ సోమవారం గ్రామస్తులు మళ్లీ కలెక్టర్ను సంప్రదించారు.

కలెక్టర్ ఆదేశాలతో బుధువారం ఆర్డిఓ కోమల్ రెడ్డి కుభీర్ చేరుకుని జెసిబి తో తొలగింపజేస్తూ స్థలాన్ని చదును చేయించారు. కాగా మరో రెండు దుకాణాల షెడ్లను తొలగించడంలో కొంత అంతరాయం ఏర్పడింది. ఆ రెండు షెడ్లకు సంబంధించిన స్థలం వర్క్ బోర్డ్ సంబంధించినది అయినట్లు పలువురు పేర్కొనడంతో దానికి సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలని ఆర్డీవో కోమల్ రెడ్డి కోరారు. రేపటిలోగా వాటిని సమర్పించాలని లేదంటే వాటిని తొలగింప చేస్తామని ఆయన వారికి సూచించారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాసిల్దార్ శివరాజ్, ఎంపీ ఓ మోహన్ సింగ్, సిఐ నైలు నాయక్, ఎస్ఐ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.