9 April, 2026 | 10:43 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

డాక్టరేట్ గ్రహీతకు ఘన సన్మానం

02-07-2025 05:20 PM

మందమర్రి (విజయక్రాంతి): పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న ఈజిఎస్ ఎపిఓ రజియా సుల్తానాను ఎంపీడీవో రాజేశ్వర్(MPDO Rajeshwar), ఇతర అధికారులు ఘనంగా సన్మానించారు. ఏసియా ఇంటర్నేషనల్ వైదిక్ అకాడమీ(Asia International Vedic Academy) ఆధ్వర్యంలో సామాజిక సేవ అనే అంశంపై ఏపీవో రజియా నిర్వహించిన పరిశోధనకు గాను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాదు నుండి గౌరవ డాక్టరేట్ ఇటీవల అందుకుంది.

ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాజేశ్వర్ తో పాటు వివిధ శాఖల అధికారులు డాక్టరేట్ గ్రహీతను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సత్యనారాయణ, ఏపిఎం లలిత, ఈజీఎస్ ఈసి మధు టిఎ రాజమల్లు, కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈద లింగయ్య సత్యనారాయణ రాజేందర్ మాజీ సర్పంచ్ ఓడ్నాల కొమురయ్య, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామచందర్, బిఆర్ఎస్ నాయకులు ఫిరోజ్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.