4 July, 2026 | 10:15 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఎన్ని కుట్రలు చేసినా గెలుపు బీజేపీదే

22-04-2025 12:00 AM
  1. ఎంఐఎం గెలుపునకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తపన
  2. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా.లక్ష్మణ్

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించేందుకే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పుకున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు.

ఇన్నాళ్లు పాముకు పాలు పోసిపెంచినట్టు ఎంఐఎంను కాపాడుకుంటూ వచ్చిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా మరోసారి మజ్లిస్‌కు సహాయపడుతున్నాయని సోమవారం ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. ఈ మూడు పార్టీలను బీజేపీ ఒక్కటే ఎదుర్కొంటుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు గెలిచే అవకాశం ఉందని భావించి, బీఆర్‌ఎస్ పార్టీ తమ ఓటర్లను ఓటు వేయొద్దని పిలుపునివ్వడం దుర్మార్గమన్నారు.

ఓటు హక్కును కాలరాసేలా బీఆర్‌ఎస్ ప్రవర్తించడం సరికాదన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ రెండూ కూడా రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ మూడు పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా, తామే గెలవబోతున్నామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.