ఐసీసీ కంటే ఎవరూ ఎక్కువ కాదు
- బంగ్లా, పాక్ బోర్డులకు జైషా చురకలు
- భారత్ ఇలాగే ఆడాలన్న ఐసీసీ చీఫ్
ముంబై, మార్చి 15: టీ20 వరల్ కప్ 2026కు ముందు జరిగిన హైడ్రామాపై అంతర్జాతీయ క్రికెట్‌కౌన్సిల్ చైర్మ న్ జైషా ఎట్టకేలకు స్పందించారు. భద్రతా కారణాల నెపంతో టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్.. అలాగే భారత్‌తో మ్యా చ్‌ను బహిష్కరిస్తామంటూ బెదిరించిన పాక్‌కు ఆయన పరోక్షంగా చురక లంటించారు. ఏ జట్టు సంస్థ కంటే పెద్ద దికాదని జైషా స్పష్టంచేశారు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అనూహ్య పరిణామాలుచోటుచేసుకున్నాయి.
భారత్‌లో పర్యటించడానికి భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకున్నా.. ఐసీసీ ఎన్ని హామీలు ఇచ్చినా వారు వెన క్కి తగ్గకపోవడంతో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసు కోవాల్సి వచ్చింది. దీనికి సంఘీభావం గా పాకిస్థాన్ కూడా తొలుత భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించి ఆ తర్వాత నిర్ణయం మా ర్చుకుంది. ఈ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు కొ న్ని జట్ల భాగస్వామ్యంపై చాలా చర్చలు జరిగాయనీ, ఏ ఒక్క జట్టూ సంస్థ కంటే పెద్దది కాదన్నారు. ఏ ఒక్క జట్టూ సంస్థ ను తయారు చేయదన్నారు. అన్ని జట్ల కలయికే ఒక సంస్థ అని జైషా కుండబద్ధలు కొట్టారు.
నేరుగా పేర్లు ఎత్తకపోయి నా.. ఆయన కామెంట్స్ పాక్, బంగ్లాను ఉద్దేశించినవేనని స్పష్టమవుతోంది. వివాదాలెన్ని ఉన్నా ఈ ప్రపంచకప్ వ్యూవ ర్షిప్‌తో సరికొత్త చరిత్ర సృ ష్టించిందని జైషా కొనియాడారు. ఈ టోర్నీలో ఏకకాలంలో 7.2 మిలియన్ల మంది వీక్షించి రికార్డు సృష్టించారు. పసికూనలు అద్భు త ప్రదర్శన చేశారని.. నెదర్లాండ్స్, జిం బాబ్వే, నేపాల్ వంటి జట్లు పెద్ద జట్లకు గట్టి పోటీ ఇచ్చాయని జైషా అభినందించారు. విజేతగా నిలిచిన టీ మిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లకు జైషా ఓ కీలక సందేశం ఇచ్చారు. అట్టడుగు నుంచి పైకి రావడానికి ఏళ్లు పడుతుందన్నారు.




