28 August, 2026 | 8:11 PM

Breaking News

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ : గుండా నిరంజన్   •   సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •  

టీ20 వరల్డ్‌కప్‌కు 500 మిలియన్ వ్యూయర్స్!

05-03-2026 01:29 AM

వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డు

దుబాయ్, మార్చి 4 : ప్రపంచ క్రికెట్‌లో టీ ట్వంటీ ఫార్మాట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెస్ట్, వన్డేలతో పోలిస్తే గత దశాబ్ద కాలంగా పొట్టి ఫార్మాట్ కే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. తాజాగా టీ20 ప్రపంచకప్‌తో ఈ విషయం మరోసారి రుజువైంది. ప్రతీసారీ వ్యూయర్ షిప్ లో రికార్డులు సృష్టిస్తోన్న టీ20 ప్రపంచకప్  ఈ సారి కూడా దుమ్మురేపుతోంది. టీవీ, డిజిటల్ వ్యూయర్ షిప్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 రికార్డులు బద్దలు కొట్టింది.

భారత్ మ్యాచ్‌లకు సహజంగానే అద్భుతమైన వ్యూయర్ షిప్ వస్తుంది. ఈ సారి మిగిలిన జట్ల మ్యాచ్‌లను సైతం అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. తాజాగా వ్యూయర్ షిప్‌కు సంబంధించిన వివరాలను ఐసీసీ ఛైర్మన్ జైషా వెల్లడించారు. సూపర్ 8 మ్యాచ్‌లను దాదాపు 500 మిలియన్ల మంది వీక్షించినట్టు తెలిపారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే రికార్డని ఆయన పేర్కొన్నారు. అలాగే జియో హాట్ స్టార్‌లో అత్యధికంగా 6.05 కోట్ల మంది మ్యాచ్‌లు వీక్షించారని సోషల్ మీడియాలో జైషా పోస్ట్ పెట్టారు. రానున్న మ్యాచ్‌లకు దీనికి మించి వ్యూయర్ షిప్ నమోదవుతుందన్నారు. 


ఇవి కూడా చదవండి:

33 బంతుల్లో సెంచరీ.. ఫిన్ అలెన్ సునామీ!

భారత్ Vs ఇంగ్లాండ్.. వాంఖేడేలో Do OR Die!

ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యం