calender_icon.png 29 December, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రులు లేరు.. ఇల్లు లేదు.. అనారోగ్యమే తోడు

29-12-2025 01:35:45 AM

  1. మెదడులో బ్లడ్ క్లాట్,వైద్యానికి నోచుకోని నిరుపేద శనిగరపు శైను

ఆపన్న హస్తం దిశగా ముందుకొచ్చిన ‘98 ఫ్రెండ్స్ ట్రస్ట్‘

దాతలు ఆర్థికసాయం అందించాలని ట్రస్ట్ విజ్ఞప్తి

వేములవాడ, డిసెంబర్ 28,(విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలంలోని నాంపల్లి గ్రామానికి చెందిన శనిగరపు శైను అనే ఆటో డ్రైవర్ తీవ్ర అనారోగ్యంతో జీవితంతో పోరాడుతున్నాడు. తల్లిదండ్రులు లేని ఈ యువకుడికి స్వంత ఇల్లు కూడా లేదు. ఇతరులు కట్టి విడిచిపెట్టిన ఇంట్లో పడేసి ఉంచగా, మేనమామే రోజూ అన్నం తెచ్చి పెడుతూ ఆదుకుంటున్నాడు.

ఆటో నడుపుతూ జీవనం సాగించిన శైనుకు అకస్మాత్తుగా మెదడులో బ్లడ్ క్లాట్ ఏర్పడి కుడి చేయి, కుడి కాలు పనిచేయకుండా పోయాయి. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ఇక్కడ చికిత్స సాధ్యం కాదని, కరీంనగర్కు తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం మరింత బ్లడ్ క్లాట్ ఏర్పడే ప్రమాదం ఉండటంతో తక్షణ చికిత్స అత్యవసరమైంది. కానీ చేతిలో రూపాయి లేక వైద్యసాయం కోసం ఎదురుచూస్తున్న దుస్థితి.

ఈ దయనీయ పరిస్థితిని తెలుసుకున్న 98 ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ శైనుకు వైద్య సహాయం కొరకు 10,000 రూపాయలు అందిస్తూ ముందుకొచ్చింది. ఇంకా చికిత్స కొనసాగించేందుకు సహృదయుల సహకారం అవసరమని ట్రస్ట్ విజ్ఞప్తి చేస్తోంది.ఆసక్తి గల దాతలు మానవతా దృక్పథంతో స్పందించి శైను వైద్య సహాయానికి సంప్రదించాలని దాతలు ఫోన్ పే/ గూగుల్ పే ద్వారా సెల్ నెంబర్ : 9573768834 కు తమ ఆర్థికసాయం అందించాలని ‘98 ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్‘ సభ్యులు దాతలను కోరారు.