29-12-2025 01:36:04 AM
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా యువతకు పోటీ పరీక్షలపై నాణ్యమైన శిక్షణ
మధిర మున్సిపాలిటి కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం
మధిర, డిసెంబర్ 28 (విజయ క్రాంతి): మధిర పట్టణ సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణతో వేగవంతంగా పనులు చేపట్టామని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణా ళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.డిప్యూటీ సిఎం ఆదివారం మధిర పట్టణంలో 3 కోట్ల అంచనా వ్యయం తో మధిర మున్సిపాలిటి నూతన కార్యాల య భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శంకుస్థాపన చే శారు.ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో ప్రజలు అల్లాడుతున్న సమయంలో దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు, ప్రజాస్వామ్య విలువలు నెలకొల్పేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28న ఇదే రోజు బొంబాయిలో 86 మంది సభ్యులతో ఆవిర్భవించిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాడు మధి ర పట్టణ ప్రజలకు పౌర సేవలు అందించే మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి నేడు భూమిపూజ చేసుకోవడం సంతోషం గా ఉందని అన్నారు. పట్టణ ప్రజల అవసరాలను తీర్చేందుకు స్థానిక మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు అధికారులు పని చేయాలని అన్నారు.స్వాతంత్య్ర పోరాటంలో పోరా డిన అనేక యోధులకు మధిర ప్రాంతం ఆశ్రయం కల్పించిందని అన్నారు. ఆనాడు వందే మాతరం గీతాన్ని బహిష్కరిస్తే సవాల్ విసిరి నిజాం పోలీసులకు ధీటుగా నిలబడి మధిర ప్రాంతంలో మూడు రంగుల జా తీయ జెండాను మహా యోధులు సర్దార్ జ మలాపురం కేశవరావు ఎగుర వేశారని డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు.
గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర మహా సభల ఉద్య మానికి మధిర పట్టణం కేంద్రంగా నిలిచిందని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. హైద రాబాద్ రాష్ట్రానికి జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా, అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ యాక్షన్ ఫలితంగా సెప్టెంబర్ 17, 1948న స్వేచ్ఛా వాయువులు లభించాయని అన్నారు.మధిర నగర విస్తరణ కోసం ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని ప్ర ణాళికలు తయారు చేస్తున్నామని, దీని నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కో సం నిధులు కేటాయించామని డిప్యూటీ సీఎం తెలిపారు. పట్టణంలో పటిష్టత్మకంగా చేపట్డిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులలో నాణ్యత లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత తవ్విన రోడ్ల పునరుద్ధరణ చేస్తామని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను కలెక్టర్ రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారని తెలిపారు. పట్టణం లో వర్షపు నీరు రోడ్లపై నిల్వకుండా ఉండాలంటే వరద నీటి కాల్వలను ప్రత్యేకంగా డిజైన్ చేసి కట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో పట్టణంలో నూతన ఇండ్లు కాలనీల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే సమయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు.
భారీ వర్షాల సమయంలో విద్యుత్ అంతరాయం రాకుండా ఉండేందుకు అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.మధిర పట్టణం సమీపంలో గ్రీన్ ఫీల్ హైవే ఏర్పాటు అవుతుందని, ఏపీ రాజధాని కూడా మనకు సమీపంలోనే ఉందని, రైల్వే ట్రాక్ కూడా అందుబాటులో ఉండటంతో పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పడిందని, దీనిని రాజకీయాలకు అతీతంగా మధిర అభివృద్ధికి వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ కమీషనర్ సంపత్, ఎంపీడివో, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.