29-12-2025 01:34:19 AM
రామగిరి, డిసెంబర్28(విజయ క్రాంతి) రామగిరి మండలంలో ని రత్నాపూర్ గ్రా మం శివారులో కెక్కెర్ల సార య్య గౌడ్ (51) గీతా కార్మికుడు వృత్తిలో భాగంగా ఈత చెట్టుపై ఎక్కుతూ ఉండగా అదుపుతప్పి అకస్మాత్తుగా కింద పడ్డాడు. స్థానికులు గమ నించి 108కు సమాచారం అందించారు. హుటాహుటిన అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివా స్, పైలట్ ఆకుల మల్లేష సంఘటన స్థలానికి చే రుకొని అతడిని పరిశీలించి, ప్రాథమిక చికి త్స చేస్తూ పెద్దపల్లి లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్తులు తరలించారు. సకాలంలో స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బందికి కుటుంబ సభ్యు లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.