calender_icon.png 29 July, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం తహసీల్దార్‌పై బదిలీ వేటు

12-10-2024 01:57:24 AM

ఖమ్మం, అక్టోబర్ 11 (విజయక్రాంతి): విధి నిర్వహణలో నిర్లక్ష్య ంగా వ్యవహరించారనే ఆరోపణల తో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ చి ట్టెంపల్లి స్వామిపై బదిలీ వేటు వే శారు. ఆయన్ని ఖమ్మం కలెక్టరేట్‌కు అటాచ్ చేశారు. సంవత్సరకాలంగా అర్బన్‌లో పని చేస్తున్న స్వామిపై పలు అంశాలపై ఆరోపణలు వచ్చా యి.

కుల, ఇతర ధ్రువీకరణ పత్రా ల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలపై ఆయన బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. గత సో మవారం జరిగిన ప్రజావాణిలో ఆయనపై కొందరు ఫిర్యాదులు చే యగా.. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ స్పది ంచి బదిలీ చేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్న సూర్యదేవర కల్పనకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.