03-12-2025 10:46:22 PM
హనుమకొండ (విజయక్రాంతి): సంగెం మండలంలోని పెద్దతండా పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గుగులోతు వినోద రవీందర్ నాయక్ తండా వాసుల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో నామినేషన్ల గడువు ముగిసే సమయానికి సర్పంచ్ అభ్యర్థులతో పాటుగా 8 వార్డులకు ఒక్కొక్కటి నామినేషన్ మాత్రమే దాఖలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పెద్ద తండా సర్పంచ్ గా గుగులోత్ వినోదరవీందర్ నాయక్ ఎన్నిక లాంఛనమే కానుంది.
నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.14న సర్పంచ్ పాటుగా వార్డు సభ్యులకు ఎన్నిక పత్రం అందించనున్నారు. పెద్దతండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుగులోత్ వినోదరవీందర్ నాయక్ మాట్లాడుతూ తనను ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు, తన ఎన్నికకు సహకరించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పెద్దతండా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,తండా అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా, తన వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు.