calender_icon.png 16 October, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ గంధం చెట్లు నరికి దొంగతనం చేస్తున్న ముఠా అరెస్ట్

15-10-2025 10:24:02 PM

నేరస్తులది మధ్యప్రదేశ్..

166 చెట్లు నరకడంతో రైతులకురూ కోటి 66 లక్షల నష్టం..

నల్గొండ క్రైమ్: శ్రీ గంధం చెట్లను నరికి దొంగతనం చేస్తున్నా ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 11 శ్రీ గంధం మోద్దులు, కట్టర్, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను నల్గొండ డి.ఎస్.పి శివరాంరెడ్డి తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రైతులు కొన్ని సంవత్సరాలుగా పెంచుకున్న శ్రీ గంధం చెట్లను రాత్రి సమయంలో నరికి  మధ్యప్రదేశ్ చెందిన దొంగల ముఠా షాగను అమ్ముకుంటున్నారు. కనగల్ మండల లోని నేషనల్ హైవే 595 రోడ్ లోని శ్రీ గంధం చెట్లు ఉన్న చిలుక విద్యాసాగర్ రెడ్డి తోటలో రంపం మిషన్ లు, గొడ్డల్లు, ఉపయోగించి తోటలో 10 శ్రీగంధం చెట్ల మొద్దులు దొంగిలించుకొని, 5 శ్రీగంధం చెట్ల నరికి వదిలివేసినారని చిలుక విద్యాసాగర్ రెడ్డి పిర్యాదు చేశారు. లో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులను చూసి ముగ్గురు అనుమానస్పధముగా వెనుకకు తన బైక్ లను తిప్పుకొని వెళ్ళు చుండగా వారిని పోలీస్ పట్టుకున్నారు.

వారి వద్ద ఉన్న 3 రంపాలు, 3 గొడ్డల్లు, ఫెన్సింగ్ వైర్ కట్ చేసే ఒక కట్టర్, ఒక ఆక్సల్ బ్లేడ్, మూడు మొబైల్ ఫోన్ లు రెండు బైక్ లపై వెళ్తున్నా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా అన్నాభౌ లక్ష్మణ్ గైక్వాడ్, నివాసం: మహారాష్ట్ర స్టేట్ (పరారీలో) దివానా తండ్రి కుక్కనీయ, గంధిగ్రామ్ గ్రామం, జానక్పుర్ తాలూకా, కాట్నీ జిల్లా, మధ్యప్రదేశ్, దద్ద సింగ్, అరుద్వా గ్రామం, తాలూకా, కాట్నీ జిల్లా, మధ్యప్రదేశ్, మజాన్, సుగువా గ్రామం, లాలక్పూర్ తాలూకా,  కాట్నీ జిల్లా, మధ్యప్రదేశ్, జవాస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం(పరారీలో), అజుబా మధ్యప్రదేశ్ రాష్ట్రం (పరారీలో) ఉన్నారు. నేరస్తులు వారందరు మధ్యప్రదేశ్ రాష్ట్రము, అజుబా గవన్ గ్రామం, రిటీ తహసిల్, కట్నీ, పన్నా జిల్లాలకు చెందిన వారు. వీరు దేశములోని వివిద ప్రాంతలో సంచార  జీవనము గడుపుతూ రుద్రాక్షలు, పూసలు అమ్ముకొంటూ జీవనం గడుపుతుంటారు, వీరు గ్రామ శివారు ప్రాంతoలో గుడారాలు వేసుకొని నివసిస్తుంటారు.

వీరికి మహారాష్టకు చెందిన అన్నాభాహు లక్ష్మణ్ గైక్వాడ్ పరిచయం అయినాడు. డబ్బు సంపాదించాలంటే శ్రీగంధం మొక్కలు దొంగతనం చేయాలని ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పాడు దీనితో కనగల్ మండలంలోని తెలకంటి గూడెం, తిమ్మన్న గూడెం,నార్కట్ పల్లి మండలం,గుర్రంపోడు మండలం,నల్లగొండ రూరల్, చండూరు మండలం మొత్తం 6 దొంగతనాలు చేసినారు. వీరు 40 కే‌జిల షాగాను అప్పచెప్పాగా, ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఇచ్చాడు. వీళ్ళు 166 శ్రీగంధం చెట్లు నరికి నష్టపరచగా రైతులకు సుమారు 1 కోటి 66 లక్షల  ఆర్థిక నష్టం జరిగిందన్నారు. ఈ సమావేశం లో సి‌ఐ కె ఆధి రెడ్డి, ఎస్.ఐ. లు కె రాజీవ్ రెడ్డి, వెంకన్న, D. సైదా బాబు,  రైటర్ వి. రమేశ్, జానకి రాములు, తిరుమలేష్, శ్రీకాంత్, రాజు, బాలకోటి, శంకర్, శేఖర్, B. సురేశ్, CH.రమేశ్, T వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.