ఐమాక్స్‌లో నార్త్ ఈస్ట్ కనెక్ట్ ప్రోగ్రాం
21, 22 తేదీల్లో పలు భాషల చిత్రాల ప్రదర్శన
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): నార్త్ ఈస్ కనెక్ట్ ప్రోగ్రాం లో భాగంగా ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని ఐమాక్‌స థియేటర్‌లోని స్క్రీన్ -4, స్క్రీన్ -5 లలో పలు భాషల సినిమాలను ప్రదర్శించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రి యాంక తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 సినిమాలతో పాటు 4 తెలుగు సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
ఆయా సినిమాల దర్శకులు, ఇతర ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఐమాక్స్ థియేటర్‌ను కమిషనర్ సందర్శించారు. సినిమాల ప్రదర్శనకు, ఆహ్వానితులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకి, థియేటర్ నిర్వాహకులకు సూచించారు. నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఏ టెక్నో కల్చర్ ఫెస్టివల్ భాగంగా వివిధ వేదికలపై ఐటీ, కల్చలర్ ప్రోగ్రామ్స్‌తో పాటు సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
టీజీఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో సినిమాలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఆమెవెంట సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కిషోర్ బాబు, సీఐఈ రాధా కిషన్, ఉప సంచాలకులు యాసా వెంకటేశ్వర్లు, ఐమాక్స్ థియే టర్ జనరల్ మేనేజర్ వెంకట ప్రసాద్, క్యూ బ్ ప్రతినిధి రఘురామ్, యూఎఫ్‌వో ప్రతినిధి సంజయ్, మాచిరాజు సాయి ప్రసాద్ ఉన్నారు. సాంస్కృతిక వైవిధ్యాన్ని అవగాహన చేసుకునుటకు ఈ సినిమా ప్రదర్శ నలను తిలకించాలని నగర ప్రజలకు స్పెషల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.




