calender_icon.png 26 May, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లూలైట్‌తో సమస్య కాదు!

05-08-2024 12:00:00 AM

నిద్రకు ముందు ఫోన్ చూడకూడదన్నది ఎప్పటి నుంచో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వెదజల్లే ‘బ్లూ లైట్’ మన కళ్లని ఇబ్బందికి గురిచేసి, నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ని నిరోధిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అసలు బ్లూలైట్ నిజంగానే మన నిద్రపైన ప్రభావం చూపుతోందా? చూపితే ఎంత మేరకు? అనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.

ప్రపంచవ్యాప్తంగా ఇదివరకే జరిగిన 11 సమగ్ర అధ్యయనాలని ఇందుకోసం అన్వేషించారు. బ్లూలైట్‌కు, నిద్రకు ప్రత్యక్షంగా సంబంధం ఉందా? అని తరచి చూసి.. చివరికి లేదు అని తేల్చారు. మన నిద్రపైన దాని ప్రభావం ఏమాత్రం చెప్పుకోదగ్గది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరీ ఇది కాకుంటే మరేంటని ఆలోచిస్తున్నారా? అదేం లేదు.. సోషల్ మీడియా.. యూట్యూబ్, వాట్సాప్ చూడాలనే ఆలోచనలదే అని నిర్ధారించారు.