05-08-2024 12:00:00 AM
ఏరోబిక్ వ్యాయామాలతో జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడులోని కొన్ని ప్రదేశాలకు రక్తప్రసారం పెరిగి, తద్వా రా జ్ఞాపకశక్తి మెరుగవుతున్నట్టు పరిశోధన ల్లో తేలింది. అల్జీమర్స్ జర్నల్స్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఏరోబిక్స్‌తో పెరిగే రక్తప్రసారంతోఓ వృద్ధుల్లో తలెత్తే మతిమరుపు సమస్యలు తగ్గుముఖం పట్టాయని తేలింది. జ్ఞాపకశక్తితో సంబంధం శరీరంలో అవయవాలకు రక్తప్రసారాన్ని మెరుగుపరిచే మందులు కనుగొనడం ద్వారా, అల్జీమర్స్ వ్యాధి కి చికిత్స అందించే వెసులుబాటు కలిగిందని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఈ అధ్యయనం కోసం 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న 30 మందిపై ప్రయోగాలు జరిగాయి. శాస్త్రవేత్తలు వీరిలో సగం మందితో ఏడాది పాటు ఏరోబిక్ వ్యాయామాలు, మిగతా వారితో సాధారణ వ్యాయా మాలు చేయించారు. ఏరోబిక్ వ్యాయామాలు చేసిన వారి మెదడులో రక్తప్రసారా ల్లో మార్పులు, తద్వారా జ్ఞాపకశక్తిలో చోటుచేసుకునే పరిణామాలు ఆశాజనకంగా ఉన్నాయని గుర్తించారు.