అంగుళం భూమి అన్యాక్రాంతం కావొద్దు
- హౌసింగ్ బోర్డు భూములను పరిరక్షించాలి
- లీజు భూములు, షాపుల రెగ్యులరైజేషన్‌కు అవకాశం
- ఇంటి పక్కనే ఉన్న వంద గజాల్లోపు స్థలాల విక్రయాలకు గ్రీన్‌సిగ్నల్
- రాష్ర్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : హౌసింగ్ బోర్డుకు చెందిన అం గుళం భూమి కూడా అన్యాక్రాంతం కావొద్దని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. హౌసింగ్ బోర్డు భూ ముల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హౌసింగ్ బోర్డు భూములపై సోమవారం సచివాలయంలో ని తన కార్యాలయంలో అధికారులతో స మావేశం నిర్వహించారు. హౌసింగ్ బోర్డు భూముల లీజు, అగ్రిమెంట్లు, కోర్టు కేసులు, అద్దెలు తదతర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
ఒకవైపు భూముల పరిరక్షణకు చర్య లు తీసుకుంటూనే మరో వైపు లీజు, కమర్షియల్, అద్దెలు, రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. నిజాం కాలం నుంచి 115 సంస్థలకు హౌసింగ్ బోర్డు భూములను లీజుకు ఇచ్చారని, ఇందులో ప్రధానంగా ఇనిస్టిట్యూషన్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, స్కూల్స్, టెంపుల్స్ ఉన్నాయని, ఇక ఏడు స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు, అలాగే అద్దెబకాయిలు ఉన్నాయని అధికారులు మంత్రి కి వివరించారు.
లీజు అగ్రిమెంట్ పునరుద్ధరణ చేసుకుని సంస్థలకు హౌసింగ్ బోర్డు తరఫున లేఖలు రాసి వాటి రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఇవ్వాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. రాష్ర్టంలో హౌసింగ్ బోర్డుకు వివిధ ప్రాంతాల్లో 301 కమర్షియల్ షాపులు ఉండగా 2007లో అప్పటి ప్రభు త్వం ఇచ్చిన అవకాశం మేరకు 14 మంది షాపులు కొనుగోలు చేయగా, మిగిలిన 287 షాపులకు గాను 62 షాపులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించండి
హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి షాపు యజమాని ప్రతి ఏడాది 10శా తం అద్దెను పెంచుతూ షాపును రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ నిబంధన అమలు కాకపోవడంతో షాపు యజమానుల నుంచి హౌసింగ్ బోర్డుకు కోట్లాది రూపాయిలు రావలసి ఉందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. దీనిపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ ప్రస్తుతం షాపులు నిర్వహిస్తున్న వారు ఆ షాపులను కొనుగోలు చేయడానికి ముందుకువస్తే మా ర్కెట్ ధర ప్రకారం విక్రయించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు.
అలాగే షాపు నిర్వహణకు అనువుగా లేకపోతే ఆ స్థలాన్ని వేలంలో విక్రయించాలని సూచించారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు హౌసింగ్ బోర్డుకు చెందే లా పటిష్టమైన వాదన వినిపించేలా ప్రత్యేకంగా అడ్వకేట్స్‌ను నియమించుకోవాలని సూచించారు. హౌసింగ్ బోర్డు గతంలో కేటాయించిన ఇండ్లకు పక్కనే ఉన్న వంద గజాల లోపు స్థలాలను ఆ ఇంటి యజమానికి ఆస క్తి ఉంటే విక్రయించాలన్నారు. అలాగే గతం లో ఇంటి కోసం హౌసింగ్ బోర్డు కేటాయించిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఇప్పుడు అవకాశం కల్పించాలన్నారు.
పక్కనే ఉన్న వంద గజాల లోపు స్థలాన్ని కూడా కొనుగోలు చేసుకుంటే మొత్తం స్థలానికి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పిం చాలని సూచించారు. మార్కెట్ ధర, సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ వంద గజా లలోపు స్థలాలు, రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కనే ఉన్న వంద గజాలలోపు స్థలాన్ని అడుగుతున్నవారి వివరాలతో నివేదిక తయారు చేయాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్, సీఈ వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.




